ఈమెను చూసిన చంద్రుడు నేలపైకి దిగిరాడా నా వెన్నెల నీవని..

10 December 2023

12 అక్టోబర్ 1993 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజధాని లండన్ నగరంలో జన్మించింది అందాల తార రుక్సార్ ధిల్లాన్.

లండన్ లో పుట్టినప్పటికీ ఇండియాలోని గోవాలో పెరిగారు. ఇప్పుడు కుటుంబంతో కలిసి బెంగళూరులో స్థిరపడింది ఈ బ్యూటీ.

ఇండియాలో పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టభద్రురాలైంది ఈ ముద్దుగుమ్మ.

2016లో రఘుశాస్త్రి దర్శకత్వంలో కన్నడ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రన్ ఆంటోనీతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

2017లో కేఆర్ విజయ్ కరణ్ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ఆకతాయితో తెలుగు తెరకు కథానాయకిగా పరిచయం అయింది ఈ భామ.

తర్వాత 2018లో నాని డ్యూయల్ రోల్ చేసిన కృష్ణార్జున యుద్ధం అనే తెలుగు సినిమలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ వయ్యారి.

2019లో ABCD: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే చిత్రంలో అల్లు సరసన హీరోయిన్ గా కనిపించింది ఈ చిన్నది.

2022లో అశోక వనంలో అర్జున కల్యాణం చిత్రంలో విశ్వక్ సేన్ కి జోడిగా నటించి మెప్పించింది. మరో హీరోయిన్ రితికా నాయక్.