07 September 2025

కన్నడ బ్యూటీకి క్రేజీ ఛాన్స్.. రామ్ చరణ్, సుకుమార్ మూవీలో ఆ హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబబు సన దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక.

అలాగే ఈ సినిమాతోపాటు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరోసారి నటించేందుకు రెడీ అయ్యారు చెర్రీ. ఈ మూవీ గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీలో చరణ్ సరసన కన్నడ బ్యూటీకి క్రేజీ ఛాన్స్ వచ్చిందని టాక్. 

ఈ సినిమాలో చరణ్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ నటించనున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

 రక్షిత్ శెట్టి జోడిగా సప్త సాగరాలు దాటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 

తాజాగా తమిళంలో శివకార్తికేయన్ సరసన మదరాసి సినిమాతో మరోసారి ఇంప్రెస్ చేసింది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ అమ్మడు పేరు మారుమోగుతుంది. 

తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో రుక్మిణి నటిస్తుంది. ఇటీవల మదరాసి సినిమా ప్రమోషన్లలో తనకు చరణ్ అంటే ఇష్టమని చెప్పింది.

దీంతో ఈ బ్యూటీకి ఛాన్స్ ఇవ్వాలంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.