08 November 2025

వాడొక ఫ్రాడ్.. నమ్మి మోసపోకండి.. హీరోయిన్ రుక్మిణి వసంత్..

Rajitha Chanti

Pic credit - Instagram

సప్త సాగరాలు దాటి సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది రుక్మిణి వసంత్. ఇటీవలే కాంతార చాప్టర్ 1 సినిమాతో మరింత ఫాలోయింగ్ తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, కన్నడ, తమిళ భాషలలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా తన అభిమానులను హెచ్చరిస్తూ పోస్ట్ చేసింది రుక్మిణి.

ఆమె పేరుతో జరిగే మోసాల గురించి బహిరంగంగా హెచ్చరికలు ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఆమె పేరుతో ఓ వ్యక్తి ఇతరులను సంప్రదిస్తున్నారట.

ఆ వ్యక్తి 9445893273 నంబర్ ద్వారా అచ్చం తనలాగే మాట్లాడుతూ సినీ ప్రముఖులను, సన్నిహితులను కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపింది.

ఆ నంబర్ తనది కాదని.. ఈ నెంబర్ నుంచి ఫోన్ లేదా మెసేజ్ వస్తే స్పందించవద్దని.. తన పేరును ఉపయోగించడం, నకిలీ స్వరంతో ఇతరులను మోసం చేయడం 

ఇవన్నీ సైబర్ నేరమని.. ఇందులో ఎవరి ప్రమేయమున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. అవసరమైతే పోలీసులు కేసులు నమోదు చేస్తానని తెలిపింది.

తన అభిమానులు, ఫాలోవర్స్ ఎలాంటి డౌట్ వచ్చిన తనను లేదా తన టీమ్ ను నేరుగా సంప్రదించాలని..మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

రుక్మిణి వసంత్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.