24 September 2025

హీరోయిన్లకు చెమటలు పట్టిస్తున్నది అమ్మడు.. జోరు తగ్గేలా లేదుగా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. తెలుగు, కన్నడ, తమిళం భాషలలో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది. 

కన్నడలో ఆమె నటించిన ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ? 

ఆమె ఎవరో తెలుసా.. ? హీరోయిన్ రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో అటు కన్నడ.. ఇటు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. 

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పటికే తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో అరంగేట్రం చేసిన అంతగా సక్సెస్ కాలేదు.

ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది. అలాగే కన్నడలో కాంతార ప్రీక్వెల్ చిత్రంలోను మెయిన్ లీడ్ రోల్ పోషిస్తుంది.

ఇప్పటికే తమిళంలో 2 సినిమాల్లో నటించింది. 1996లో కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది. ఆమె తండ్రి సైనిక అధికారి. దేశ సేవలో ప్రాణత్యాగం చేశారు.

2007లో ఇండో-పాక్ సరిహద్దులో జరిగిన యుద్ధంలో మరణించారు. రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్ భరతనాట్య నృత్యకారిణి. రుక్మిణి సైనక పాఠశాలలో చదువుకుంది. 

2019లో కన్నడ చిత్రం 'బీర్బల్ ట్రైలజీ' ద్వారా నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీ, తమిళం, కన్నడ భాషలలో వరుస అవకాశాలు అందుకుంటుంది రుక్మిణి.