19June 2024

సినిమాల్లో పద్దతిగా.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న ఈ బ్యూటీ..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సౌత్ కుర్రాళ్ల మనసులు గెలిచి వారి హృదయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్. 

గ్లామరస్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత బట్టి సినిమాలు ఎంచుకుంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఒకే ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అంతకుముందు కన్నడలో మూడు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. 

కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. ఇందులో ప్రియ పాత్రలో జీవించింది. 

అన్ని భాషల్లో రిలీజ్ కావడంతో ఈ బ్యూటీకి అంతా ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు.

ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలు సైన్ చేసిన రుక్మిణికి తెలుగు నుంచి మాత్రం ఒక్క ఆఫర్ కూడా రాలేదని తెలుస్తోంది. 

ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. కానీ టాలీవుడ్ నుంచి ఆఫర్ రాలేదా లేదా వచ్చినా కూడా అమ్మడు చేయలేదా అనే సందేహాలు వస్తున్నాయి. 

ప్రస్తుతం కన్నడలో భగీరా, భైరథి రణగల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రుక్మిణి తమిళంలో ఏస్, శివకార్తికేయన్ 23లో నటిస్తుంది.