అందం స్త్రీ జన్మ ఎత్తి ఈమెలా మారిందేమో.. రుక్మిణి ఫోటోలు వైరల్..
03 October 2023
రక్షిత్ శెట్టి కి జోడిగా సప్త సాగరాలు దాటి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్.
10 డిసెంబర్ 1994లో కర్ణాటకలో బెంగళూరులో జన్మించింది రుక్మిణి. భారత్ సైనిక దళం మాజీ కల్నల్ వసంత్ వేణుగోపాల్ కుమార్తె ఈమె.
లండన్‌లోని బ్లూమ్స్‌బరీలోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో యాక్టింగ్‌లో పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ.
దీని తర్వాత సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ చిత్రంలో నటించి ఆకట్టుకుంది ఈ భామ. ఈ చిత్రం తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో విడుదలైంది.
2019లో కన్నడ బీర్బల్ త్రిలోజి కేసు 1: ఫైండింగ్ వజ్రముని చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఈ అందాల తార.
తెలుగులో కూడా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో అందం అభినయంతో కుర్రాళ్లని ఫిదా చేసింది రుక్మిణి.
తర్వాత బానదరియల్లి అనే కన్నడ చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది. ఈ చిత్రం తాజాగా సెప్టెంబర్ 28న థియేటర్ లో విడుదలైంది.
తర్వాత సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎకి సీక్వెల్ గా వస్తున్న సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బీలో కనిపించనుంది. ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి