చిరునవ్వు ఈమె కోసమే పుట్టిందేమో.. 

18 November 2023

18 సెప్టెంబర్ 1994న హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది అందాల తార రుహాణి శర్మ.

ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు సుభాష్ శర్మ, తల్లి ప్రాణేశ్వరి శర్మ. ఈమెకి ఓ సోదరి కూడా ఉంది. పేరు శుభి శర్మ.

ఈ వయ్యారి భామకి ఇష్టమైన ఆహారం రాజ్మా-చావల్, ఇష్టమైన ప్రదేశం ఫ్లోరిడా, ఇష్టమైన క్రికెట్, రంగు బ్లాక్.

దిల్జిత్ దోసాంజ్, షారూఖ్ ఖాన్ ఈ బ్యూటీకి ఇష్టమైన హీరోలు; దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్ ఇష్టమైన హీరోయిన్స్.

చాలా చిన్న వయస్సులోనే నటన, మోడలింగ్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. కాలేజీలో ఉన్నప్పుడు మోడలింగ్ అసైన్‌మెంట్‌లు తీసుకోవడం ప్రారంభించింది.

2013లో పంజాబీ పాట "కుడి తు పటాకా" మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది.

2017లో తమిళ చిత్రం “కడైసి బెంచ్ కార్తీ”లో తొలిసారి నటించింది. 2018లో చిలసౌ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది.

ఇటీవల హేర్ చాప్టర్ 1లో కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం వెంకీ సైంధవ్ చిత్రంలో ఓ పాత్రలో నటిస్తుంది ఈ బ్యూటీ.