అందానికి అప్పు కావాలంటే ఈమెనే షూరిటీగా ఉండాలేమో..

TV9 Telugu

23 January 2024

18 సెప్టెంబర్ 1994న హిమాచల్ ప్రదేశ్ వేసవి రాజధాని సిమ్లాకు 45 కిలోమీటర్లు దూరంలో ఉన్న సోలన్ లో జన్మించింది రుహాణి శర్మ.

చండీగఢ్‌ రాష్ట్రంలోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది వయ్యారి భామ రుహాణి శర్మ.

మోడల్ గా తన కెరీర్ మొడులుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ రావడంలో నటనవైపు అడుగులు వేసింది.

2013లో మొదటిసారిగా పంజాబీ మ్యూజిక్ వీడియోలు "తేకా బై అమ్మీ బాస్", "క్లాస్‌రూమ్", "కుడి తు పటాకా"లో కనిపించింది.

2018లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చి ల సౌలో ఆమె తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది ఈ అందాల తార.

ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ఆదరణ మరియు ప్రశంసలు లభించాయి. దీంతో ఈ వయ్యారి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

2020లో హిట్: మొదటి కేసులో విశ్వక్ సేన్ సరసన నటించింది. అదే ఏడాది డర్టీ హరి అనే చిత్రంలో కనిపించింది.

2021లో నూటోక్క జిల్లాల అందగాడు, 2023లో హర్: చాప్టర్ 2 చిత్రాలు చేసింది. తాజా సైంధవ్ మూవీలో కీలక పాత్రలో కనిపించింది.