మరోసారి వేదికపై ట్రిపుల్‌ ఆర్‌..

TV9 Telugu

12 March 2024

ప్రతిష్ట్మాక ఆస్కార్‌ అవార్డ్స్ వేదిక మీద మరోసారి మెరిసింది తెలుగు భారీ యాక్షన్ చిత్రం ట్రిపుల్‌ ఆర్‌.

అండ్‌ అగైన్‌ ఎ స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఫర్‌ అజ్‌ అంటూ ఆ విషయాన్ని షేర్‌ చేసుకుంది ట్రిపుల్‌ ఆర్‌ మూవీ యూనిట్‌.

బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అవార్డు ప్రకటించే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో స్టేజ్‌మీద నాటు నాటు పాట క్లిప్‌ ప్లే చేశారు.

2024 ఆస్కార్ వేదికపై తారక్‌, చరణ్‌ ఇద్దరూ పక్కపక్కనే స్టెప్పులేస్తున్న క్లిప్‌ చూపరులను ఆకట్టుకుంది.

దానికి తోడు ట్రిపుల్‌ ఆర్‌లోని యాక్షన్‌ సన్నివేశాలను కూడా ఆస్కార్‌ వేదిక మీద ప్రదర్శించిన ఓ వీడియోలో పొందుపరిచారు.

సినిమా ఫైట్స్ కోసం పని చేసిన స్టంట్‌ మాస్టర్లను అన్‌సంగ్‌ హీరోలుగా గుర్తిస్తూ ప్లే చేసిన క్లిప్‌ అది.

ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలో చరణ్‌, తారక్‌ కలిసి చేసే క్లైమాక్స్ యాక్షన్‌ సీక్వెన్స్ లోని క్లిప్‌ని అందులో పొందుపరిచారు నిర్వాహకులు.

ఇది తెలుసుకున్న చరణ్, తారక్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ ప్రేమికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.