మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్న యాష్..

TV9 Telugu

14 April 2024

రాకింగ్‌ స్టార్‌ యష్‌ సొంత నిర్మాణ సంస్థ అయినా మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసెందుకు సిద్ధమయ్యారు.

నమిత్‌ మల్హోత్రాకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుంది.

ఏంటా ప్రాజెక్ట్ అంటుకొంటున్నారా.? ఈ రెండు నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్ లో కలిసి రామాయణాన్ని నిర్మించబోతున్నాయి.

మన భారతీయ సినిమాను ప్రపంచ వేదిక మీద నిలపాలన్నది తనకు ఎప్పటి నుంచో కల అని అన్నారు పాన్ ఇండియా స్టార్ హీరో యష్‌.

రామాయణానికి తన మనసులో ఓ సుస్థిర స్థానం ఉందని అన్నారు. దానికోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధం అన్నారు.

అయితే ఇది ఎప్పుడు మొదలుకానుంది, నటీనటులు ఎవరు, ఎవరు డైరక్ట్ చేస్తున్నారు అన్న విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.

కేజిఎఫ్ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు యాష్. దీని చాప్టర్ 3 కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.

యాష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ ఈ పాన్ ఇండియా సినిమాకు దర్శకురాలు.