కెప్టెన్లు మారాల్సిందేగానీ...  య‌ష్ లుక్ మారే ప్ర‌స‌క్తే లేదు!

13 September 2023

కేజీయ‌ఫ్ చిత్రం రిలీజ్ అయ్యే వ‌ర‌కు రాకింగ్ స్టార్ య‌ష్ అంటే జ‌స్ట్ క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కు మాత్రమే తెలుసు.

కానీ ఇప్పుడు ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో వెయ్యి కోట్ల‌కు పైగా వ‌సూళ్లు తెచ్చుకున్న ఐదుగురు హీరోల్లో య‌ష్ ఒక‌రు.

ఆయ‌న ప‌డ్డ ఎనిమిదేళ్ల క‌ష్టానికి ఆయ‌న‌కు ల‌భించిన గుర్తింపు ప్యాన్ ఇండియ‌న్ స్టార్ య‌ష్ అనేదే. పొడ‌వాటి జుట్టు, గుబురు గ‌డ్డంతో రాకీ భాయ్ కేర‌క్ట‌ర్‌లో దుమ్ము దులిపారు య‌ష్‌.

కేజీయ‌ఫ్ ఫ్రాంఛైజీల్లోనే కాదు, నెక్స్ట్ ఏ సినిమా చేసినా కూడా ఆయ‌న ఆ లుక్‌ని వ‌దులుకునే ఉద్దేశాల్లో లేరు. య‌ష్ నెక్స్ట్ మూవీ గీతు మోహ‌న్‌దాస్ డైర‌క్ష‌న్‌లో ఉంటుంది.

నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ గీతు చెప్పిన క‌థ చాలా బాగా న‌చ్చింద‌ట య‌ష్‌కి. లార్జ‌ర్ దేన్ లైఫ్ స్పాన్‌లో అద్భుతంగా ఉంటుంద‌ట స్క్రిప్ట్. అందుకే విన‌గానే ఓకే చెప్పేశారు రాకీ భాయ్‌.

``గీతు చెప్పిన క‌థ హెవీ యాక్ష‌న్ సినిమా. ఈ ఏడాది డిసెంబ‌ర్ నుంచి షూటింగ్ మొద‌ల‌వుతుంది. ప్ర‌స్తుతం ఈ కేర‌క్ట‌ర్ కోస‌మే ప్రిపేర్ అవుతున్నారు య‌ష్‌. ఆయ‌న జుట్టు, గ‌డ్డం అలాగే ఉంటాయి.

కాక‌పోతే వాటికే కొత్త స్టైల్‌ని యాడ్ చేస్తారు. స్క్రిప్ట్ సైడ్ కూడా య‌ష్ పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. డైలాగ్స్ ప‌రంగానూ కొన్ని పంచ్ లైన్స్ ఇస్తున్నారు`` అని శాండిల్‌వుడ్ స‌మాచారం.

ఈ సినిమా త‌ర్వాత నితీష్ తివారి రామాయ‌ణంలోనూ న‌టిస్తారు య‌ష్‌. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న స‌లార్ రెండు పార్టుల్లోనూ య‌ష్ ఉంటార‌న్న‌ది అంద‌రికీ క్యూరియాసిటీ క‌లిగిస్తున్న విష‌యం.

స‌లార్‌లో రాకీ భాయ్ ఉంటాడని వార్త‌లూ ఉన్నాయి. వ‌రుస‌గా య‌ష్ క‌మిట్ అయ్యే సినిమాలు అన్నిటిలోనూ గ‌డ్డం, జుట్టు అవ‌స‌రం కాబ‌ట్టి, ఇప్పుడున్న లుక్‌ కంటిన్యూ చేస్తాడని టాక్.