రాబిన్ హుడ్ గ్లింప్స్.. సందీప్ కిషన్ వైబ్..

TV9 Telugu

02 April 2024

భీష్మ లాంటి హిట్ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేస్తున్న రెండో సినిమా ‘రాబిన్ హుడ్’.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ టీజర్.

తాజాగా నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇన్నాళ్లుగా హిట్ లేని హీరో నితిన్ ఆశలన్నీ ఈ చిత్రంపైన.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో ప్రశంసలు అందుకున్న స్వరూప్ ఆర్ఎస్‌జె మరో ఆసక్తికరమైన సినిమాతో రాబోతున్నారు.

తాజాగా రాహుల్ యాదవ్ నిర్మాతగా సందీప్ కిషన్ హీరోగా వైబ్ అనే సినిమాను ప్రకటించారు టాలీవుడ్ దర్శకుడు స్వరూప్.

యుద్ధం ఎంత పెద్దదైనా, గెలవడం కష్టమైనదైనా, ముఖ్యమైనది, మీ పోరాటంలో కొంతమంది స్నేహితులు ఉన్నారు, వారితో మీకు 'వైబ్' వుంది అనేది ఈ సినిమా కథ.

ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడించనున్నారు. షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని తెలిపారు మేకర్స్.