సొగసు చూడ తరమా.. ఇంత అందం రీతూ సొంతమేనా..

29 April 2024

ANIL KUMAR 

రీతూ వర్మ.. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి.. మెల్లిగా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో దక్కించుకుంది.

అక్కడ మొదలైన తన సినీ ప్రయాణం ఇప్పుడు సౌత్ అచ్చ తెలుగు హీరోయిన్ గా పేరు సంపాదించుకోవడం మాములు విషయం కాదు.

తెలుగు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సొగసరి గ్లామర్ పాత్రలకు మాత్రం దూరంగానే ఉంటూ వచ్చారు.

ఒక్క తెలుగులోనే కాక తమిళ, మలయాళ పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు రీతూ వర్మ.

ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా రీతూ తెలుగమ్మాయే.! రీతూ వర్మ హైదరాబాద్ లోనే పుట్టింది.

ఈమె మల్లా రెడ్డి కాలేజీ.. ఇంజనీరింగ్‌ బ్యాచిలర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని డిగ్రీ పట్టా పొందింది.

చదువు పూర్తి అయినా తరువాత.. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి.. మిస్ హైదరాబాద్ పోటీలో రన్నరప్‌గా నిలిచింది.

పెళ్లి చూపులు సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తొలి మూవీకే నేషనల్ అవార్డు అందుకొని ఇండస్ట్రీలో తనదైన మార్క్ సెట్ చేసింది.