చందమామలో అందం, వెన్నెలలో వెలుగు కలిపి ఈమెను మలచాడేమో ఆ బ్రహ్మ..

18 October 2023

10 మార్చి 1990న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జన్మించింది వయ్యారి భామ రీతూ వర్మ. ఆమె తండ్రి మధ్యప్రదేశ్‌కు చెందినవారు.

హైదరాబాద్‌లోని విల్లా మేరీ ఉమెన్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చేసింది. తర్వాత మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పట్టా పొందింది ఈ బ్యూటీ.

గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మిస్ హైదరాబాద్ బ్యూటీ పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

2012లో అనుకోకుండా అనే ఓ తెలుగు షార్ట్ ఫిల్మ్ లో తన నటనతో ఆకట్టుకుంది ఈ వయ్యారి. 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ పోటీలో దీనికి ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది.

ఈ షార్ట్ ఫిల్మ్ తో ఉత్తమ నటి అవార్డును అవార్డు అందుకున్న ఈ బ్యూటీ తొలిసారిగా 2013లో ఎన్టీఆర్ బాద్‍షా సినిమాలో పింకగా వెండి తెరపై కనిపించింది.

తర్వాత మరో రెండు తెలుగు చిత్రాల్లో ఆకట్టుకుంది. 2015లో నాని, మాళవిక నాయర్ జోడిగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కనిపించింది.

2016లో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంలో తొలిసారి లీడ్ రోల్ ల్లో నటించింది. హీరోయిన్ గా తొలి చిత్రంతో నంది అవార్డు అందుకుంది ఈ వయ్యారి.

తర్వాత తెలుగులో కేశవ, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్ వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ.