అందానికి అప్పు కావాలంటే ఈమెనే అడుగుతుందేమో..
27 November 2023
10 మార్చి 1990 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పుట్టి, పెరిగింది అందాల తార రీతూ వర్మ.
ఆమె తండ్రి మధ్యప్రదేశ్‌కు చెందినవారైనప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. తన తెలుగు చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది.
హైదరాబాద్ లోని విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి భామ.
హైదరాబాద్ లోని మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది ఈ భామ.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మిస్ హైదరాబాద్ బ్యూటీ పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది ఈ బ్యూటీ.
తెలుగులో ఓ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ అనుకోకుండాలో తన అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకొంది ఈ వయ్యారి భామ.
ఈ షార్ట్ ఫిల్మ్ 2012లో 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ పోటీలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఇందులో నటనకి ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
2013లో ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో కథానాయకిగా తొలిసారి నటించింది. దీనిలో యాంకర్ శ్రీముఖి మరో హీరోయిన్. శ్రీ విష్ణు హీరో.
ఇక్కడ క్లిక్ చెయ్యండి