ఆ హీరో సినిమాలో చిన్న రోల్ వచ్చినా వదులుకోను.. మిరాయ్ బ్యూటీ క్రేజీ కామెంట్స్ 

25 September 2025

Rajeev 

ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో రితిక నాయక్ ఒకరు. 

 ఈ యంగ్ బ్యూటీ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 

తొలి సినిమాతోనే తన అందంతో ఆకట్టుకుంది. క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత నటిగా మారి ప్రేక్షకులను అలరిస్తుంది. 

మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు.

 నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్  అందుకుంటుంది.

రితికా నాయక్ తనకు ఓ స్టార్ హీరోతో కలిసి నటించాలని ఉందని తెలిపింది. ఆ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 

అల్లు అర్జున్ తో నటించడం అనేది నా కల. ఆయన సినిమాలో ఎలాంటి పాత్ర అయినా సరే.. ఎలాంటి సినిమా అయినా సరే నేను నటిచడానికి రెడీ అంటుంది రితికా