ఢిల్లీ నుంచి టాలీవుడ్ దాకా.. కుర్రాళ్లను ఆగం చేస్తోన్న మిరాయ్ బ్యూటీ.. 

17 September 2025

Phani Ch

15 మే 2000న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది 24 ఏళ్ల అందాల తార రితిక నాయక్. ఈమె కుటుంబం ఒడిస్సాకి చెందినది.

ఈ వయ్యారి తండ్రి పేరు బిజయ్ నాయక్, తల్లి పేరు సుస్మిత నాయక్. ఈ క్యూట్ బ్యూటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

2019లో మోడలింగ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12, మిస్ దివా 2020 వంటి టైటిల్‌లను కూడా గెలుచుకుంది.

2022లో విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో హీరోయిన్‎గా వెండితెరకు పరిచయం అయింది.

తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ నెరజాణ. దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది.

గత ఏడాది నాని మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం హాయ్ నాన్న క్లైమాక్స్‎లో ఓ కనిపించి మెప్పించింది.

మిరాయ్ చిత్రంలో తేజ సజ్జా, మంచు మనోజ్,శ్రియ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మించారు.