బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్‌తో నేమ్, ఫేమ్ కొట్టేసిన నటీనటుల లిస్టు పెద్దదే. అందులో రీతూ చౌదరి కూడా ఒకరని చెప్పుకోవాలి.
జబర్దస్త్ స్కిట్స్ చేస్తూ జనాల్లో పాపులారిటీ పెంచుకుంది రీతూ. ఈ వేదికగా మంచి ఫేమ్ కొట్టేసిన లేడీ కామెడియన్లలో ఒకరిగా నిలిచింది.
సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది.
జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్, వెండితెరపై పలు సినిమాలు కూడా చేసిన రీతూ.. అక్కడ రాని పాపులారిటీ జబర్దస్త్ వేదికగా అందుకుంది.
జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెరుస్తూ బుల్లితెర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టింది రీతూ చౌదరీ.
గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు అందాల జాతర చేస్తోంది రీతూ చౌదరీ. తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని లాగేస్తోంది.
కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా రీతూ ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతూ వస్తున్నారు. అందుకు కారణం ఎప్పటికప్పుడు రీతూ పోస్ట్ చేసే ఫొటోస్.