ఆ చందమామే ఈ ముద్దుగుమ్మా రూపంలో నేలకి జాలువారిందేమో..
TV9 Telugu
22 April 2024
రిద్ధి కుమార్.. లవర్ సినిమాతో చలన చిత్ర అరంగేట్రం చేసింది. రాజ్ తరుణ్ సరసన కథానాయకిగా ఈ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసింది.
చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది రిద్ధి.
రాధేశ్యామ్ సినిమాలో ఒక చిన్న పాత్రలు తళుక్కున మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో అర్చరీ ప్లేయర్ గా కనిపించింది.
ఇక ఇప్పటివరకు మరో తెలుగు సినిమా చేయలేదు. ఈ బ్యూటికి అనుకున్నంతగా అవకాశాలు కూడా టాలీవుడ్ లో రావడం లేదు.
అలాగే అటు మలయాళంలోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కెరీర్ తొలినాళ్లలో ఈబ్యూటీ గ్లామర్ రోల్స్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ భామకు అవకాశాలు అంతగా రావడం లేదని టాక్ వినిపిస్తుంది.
దీంతో ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో అలరిస్తుంది. వరుస ఫోటోషూట్స్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. కుర్రకారు మతులు పోగొడుతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది ఈ వయ్యారి భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి