వారంలో రెండు RGV సినిమాలు.. మిథున్ చక్రవర్తికి గుండెపోటు..
TV9 Telugu
12 February 2024
మూడు నెలల వాయిదాల తర్వాత.. ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకున్న వ్యూహం సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుంది.
ఈ పొలిటికల్ థ్రిల్లర్ విడుదలకి ఒక్కవారం గ్యాప్‌లోనే సీక్వెల్‌ను కూడా దించేస్తున్నారు. శపథం మార్చ్ 1న విడుదల కానుంది.
ఇదంతా చూసాక.. వర్మది మామూలు ప్లానింగ్ కాదు అంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, సినిమా ప్రేక్షకులు.
మార్చ్ 1న వరుణ్ తేజ్ హీరోగా ఆపరేషన్ వాలంటైన్ కూడా విడుదల కానుంది. దాంతో పాటే శపథం తీసుకొస్తున్నారు RGV.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, మాజీ భారతదేశ రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు.
ఇప్పుడు ఆయన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.
తాజాగా శనివారం (ఫిబ్రవరి 10) ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
కానీ ఆయన ఆరోగ్య విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మధ్యే ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి