ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదం.. 14 రైళ్లు రద్దు..ఐదు దారి మళ్లింపు

31 October 2023

మెగా కుటుంబంలోని సభ్యులందరూ.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక కోసం ఇటలీ వెళుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మెగా స్టార్ ఫ్యామిలీ అంత కలిసి అక్కడికి చేరుకుని అన్ని పనులను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.

ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆయన వైఫ్ అన్నా లెజినోవా కూడా వరుణ్ తేజ్‌- లావణ్య త్రిపాఠి పెళ్లికి వెళ్లారు.

మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్‌ వైఫ్ రేణుదేశాయ్‌.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి వెళుతున్నారా...?

అంటే రీసెంట్ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్ళికి వెళ్లడం లేదనే సమాధానం ఇచ్చారు రేణు దేశాయ్‌..

తాను వెళ్లడం లేదని.. తన పిల్లలు అకీరా నందన్, ఆద్యా వెళుతున్నారని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు రేణు దేశాయ్‌.

వరుణ్ తేజ్ తన కళ్ల ముందే పెరిగాడని.. అతనికి ఎప్పుడూ తన ఆశిస్సులు ఉంటాయని కూడా అన్నారు రేణు దేశాయ్‌..

నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరగనుంది. దీంతో అక్కడికి చేరుకున్నరు మెగా కుటుంబ సభ్యులు.