అరెస్టు అవుతారు.. జాగ్రత్తగా ఉండండి.. వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్

Rajeev 

13 SEp 2024

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె అకీరా, ఆద్య గురించి చేసే పోస్టులు క్షణాల్లో వైరలవుతుంటాయి. 

ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్. కానీ ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేయలేదు. 

సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండే రేణు దేశాయ్. సమాజంలో జరిగే వాటిపై కూడా స్పందిస్తూ ఉంటారు. 

అలాగే పెట్స్ గురించి చాలా పోస్ట్లు షేర్ చేశారు. రీసెంట్ గా విజయవాడ వరదల్లో చిక్కుకున్న పెట్స్‌ను కాపాడాలని కోరారు రేణు. 

మూగ జీవాల కోసం రేణు దేశాయ్ చేసే సహాయ కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో రేణు ఓ పోస్ట్ షేర్ చేశారు. 

ఓ వ్యక్తి కుక్కను చిత్రహింసలు పెడుతున్న వీడియో షేర్ చేసింది రేణు. ఓ వ్యక్తి కుక్క వెనుక కాళ్ళను పట్టుకొని గిరగిరా తప్పుతూ దాన్ని ఇబ్బందిపెట్టాడు. 

అతని డీటైల్స్ ను రేణు కనుక్కున్నారు. ఇప్పుడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు ఇలాంటి తప్పులు చేస్తే వెంటనే అరెస్టు అవుతారు.. జాగ్రత్తగా ఉండండి.. అని హెచ్చరించింది రేణు దేశాయ్.