ట్రెండీగా మారిన రిలీజ్‌కి ముందు వీడియో సాంగ్..

09 November 2023

సినిమా రిలీజ్‌కు ముందే వీడియో సాంగ్స్ విడుదల చేయడం అనేది మన స్టైల్ కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రమోషన్ అది.

అక్కడ ఎంత పెద్ద సినిమా అయినా విడుదలకు ముందుగానే వీడియో సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తుంటారు. కానీ మన దగ్గర మాత్రం అలా కాదు.

కానీ కొన్ని సినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారిప్పుడు. తాజాగా కార్తి జపాన్ నుంచి ఫుల్ వీడియో సాంగ్ వచ్చింది.

రిలీజ్‌కు రెండు రోజుల ముందుగానే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసారు జపాన్ మేకర్స్. ఇది సినిమాపై ఆసక్తి కూడా పెంచేస్తుంది.

మొన్నటికి మొన్న మ్యాడ్ సినిమాకు కూడా ఇదే చేసారు దర్శక నిర్మాతలు. కళ్లాజోడు కాలేజ్ పాప చూడు అంటూ సాగే పాటను విడుదల చేసి.. సినిమాకు ఫుల్ ప్రమోషన్ తెచ్చుకున్నారు.

ఆ సాంగ్ తర్వాతే మ్యాడ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. మ్యాడ్ ట్రైలర్, టీజర్ కంటే కళ్ళాజోడు వీడియో సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ నెక్ట్స్ లెవల్ అంతే.

దసరా సినిమాకు కూడా రిలీజ్‌కు ముందే ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. పాన్ ఇండియన్ రిలీజ్ కాబట్టి బాలీవుడ్ ప్రమోషన్స్ ఫాలో అయ్యారు మేకర్స్.

గతేడాది నితిన్ మాచర్ల నియోజకవర్గంలోని వీడియో సాంగ్ ఇలాగే విడుదల చేసారు. ఏదేమైనా ఈ ఫార్ములా కొన్ని సినిమాలకు బాగానే వర్కవుట్ అవుతుంది.