పెళ్ళికి రెడీ అయిన రెజీనా.. ఎంగేజ్‌మెంట్ అంటూ రాసుకొచ్చిన భామ
Rajeev
15 March 2024
రెజీనా కాసాండ్రా.. శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ను పలకరించింది ఈ వయ్యారి భామ.
తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది రెజీనా. ఆతర్వాత స్టోరీ సినిమాతో హిట్ అందుకుంది.
ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు. తమిళ్, కన్నడ భాషలోనూ సినిమాలు చేసింది.
పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత సరైన హిట్ అందుకోలేకపోయింది.
హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్ లోనూ మెప్పించింది ఈ బ్యూటీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య లో స్పెషల్ సాంగ్ చేసింది.
ఇక సొషల్ మీడియాలో రెజీనా చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు షేర్ చేసిన ఈ చేసిన ఈ బ్యూటీ ఎంగేజ్‌మెంట్ అని ట్యాగ్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రెజీనా త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఇలా ఎంగేజ్‌మెంట్ అని ట్యాగ్ చేయడం వైరల్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి