02 January 2024

భయపెట్టిన కన్జూరింగ్ కన్నప్పన్.. ఇప్పుడు ఓటీటీల

TV9 Telugu

గతంలో పలు సూపర్‌ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ రెజీనా కసాండ్ర. 

 తాజాగా రెజీనా నటించిన మరో సూపర్‌ హిట్‌ చిత్రం కన్‍జ్యూరింగ్ కన్నప్పన్. 

డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. 

దెయ్యాలు తిరిగే పీడకలల్లో చిక్కుకోవడం చుట్టూ తిరిగే... ఈ మూవీ కథ కోలీవుడ్‌ ఆడియెన్స్‌ను బాగా అలరించింది. 

థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టిన కన్‍జ్యూరింగ్ కన్నప్పన్ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. 

ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి కన్‍జ్యూరింగ్ కన్నప్పన్ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.