వన్స్ హి స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్.. కల్కి రికార్డుల మోత..
TV9 Telugu
02 July 2024
తొలి వీకెండ్‌లో 555 కోట్ల వసూళ్లతో ‘కల్కి 2898 ఏడీ’ అధిక వసూళ్లుల తొలి చిత్రంగా నిలిచింది. 520 కోట్లతో ఉన్న జవాన్ రికార్డు బద్దలైంది.
మలేషియాలో ‘సలార్’ ఫుల్ రన్ రికార్డును ‘కల్కి’ (తమిళ వెర్షన్) మూడు రోజుల్లో రూ.2.2 కోట్లు వసూలతో బ్రేక్ చేసింది.
జర్మనీలోనూ రూ.2.25కోట్లు వసూలతో ‘ఆర్‌ఆర్ఆర్’, ‘సలార్’, ‘బ్రహ్మాస్త్ర’, ‘కేజీయఫ్2’ రికార్డులను దాటేసి టాప్ ప్లేస్ లో నిలిచింది ‘కల్కి’.
ఇక నార్త్ అమెరికాలో మొదటి వీకెండ్‌లోనే 11 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
‘ఇన్‌సైడ్ అవుట్2’, ‘ఎ క్వైట్ ప్లేస్: డే వన్’కు దీటుగా వసూళ్లు రాబడుతూ మూడోస్థానంలో నిలిచి వరల్డ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తోంది.
భరత్ లో ఈ ఏడాది టాప్ లో ఉన్న ‘హను-మాన్’ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ‘కల్కి’ నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.191.5 కోట్లు వసూలతో ఈ ఏడాది అధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో తొలిరోజు అధిక వసూళ్లుచేసిన టాప్-3 చిత్రాల్లో చేరింది.
కెనడాలో కూడా ‘కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతోంది. అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.