శంకర్ దాదా రీ-రిలీజ్‌తో ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. 20 ఏళ్ల సీక్రెట్ ఔట్..
01 నవంబర్ 2023
రీ రిలీజ్ పెరిగిన క్రేజ్ వాడుకుంటూ చాలా సినిమాలను మళ్లీ తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నవంబర్ 4న శంకర్ దాదా ఎంబిబిఎస్ కూడా రాబోతుంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఆల్‌టైమ్ కామెడీ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకుడు.
2004లో విడుదలైన శంకర్ దాదాకు 4K మెరుగులు దిద్ది మళ్లీ తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.
సాధారణంగా రీ రిలీజ్ సినిమాల్లో 4K వర్షన్ తప్పిస్తే.. చూడ్డానికి కొత్తగా ఏముండదు. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం వస్తుంటారు ఫ్యాన్స్.
అయితే శంకర్ దాదా ఎంబిబిఎస్‌లో మాత్రం ఓ కొత్త విషయం ఉంది. 20 ఏళ్లుగా దాచేసిన విషయాన్ని రీ రిలీజ్‌లో రివీల్ చేయబోతున్నారు.
అదే సందె పొద్దుల తాండే అంటూ సాగే పాట. 20 ఏళ్లుగా ఈ పాటకు సంబంధించి ఆడియో తప్ప వీడియో బయటికి రాలేదు.
20 ఏళ్ళ కింద శంకర్ దాదా MBBS విడుదలైనపుడు 50 రోజుల తర్వాత కొత్త పాట యాడ్ చేసారు.. ఆ పాటనే ప్రమోషన్ కోసం ఇప్పుడు వాడుకుంటున్నారు.
ఆ పాట కోసమైనా ఫ్యాన్స్ వస్తారని నమ్ముతున్నారు. ఆ మధ్య బాబా సినిమాను కొత్త క్లైమాక్స్‌తో రీ రిలీజ్ చేసారు.. అది వర్కవుట్ అయింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి