RC16 పూజా కార్యక్రమాలు.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్..

TV9 Telugu

23 March 2024

రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా అట్టహాసంగా మొదలైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలు కానుంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాను ఆర్నెళ్లలోనే పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చిబాబు.

ఇందులో చరణ్ పక్కన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాల వీడియో విడుదలైంది.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా తండేల్. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.

తాజాగా తండేల్ ఆన్ లొకేషన్ పిక్స్ విడుదలయ్యాయి. ఇందులో చైతూతో పాటు అల్లు అరవింద్, చందూ మొండేటి కూడా ఉన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీనికోసం పాకిస్థాన్ జైలు సెట్ కూడా వేశారు మూవీ మేకర్స్.

ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో కనువినీ ఎరుగని రీతిలో సగర్వంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాకతో SIFFకు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.