28 September 2023
ఇది ఆయన కెరీర్‌లో మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు.. పోస్ట్ ప్రొడక్షన్ జోరుగా జరుగుతుంది.
టైగర్ వచ్చిన 3 నెలలకే సంక్రాంతికి ఈగల్‌తో వచ్చేస్తున్నారు రవితేజ. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.
సంక్రాంతి రవితేజకి బాగా అంటే బాగా కలిసొచ్చింది. 2003లో ఈ అబ్బాయి చాలా మంచోడు మినహా.. 2008లో కృష్ణ, 2011లో మిరపకాయ్, 2021లో క్రాక్, 2023లో వాల్తేరు వీరయ్యలతో హిట్లు కొట్టారు మాస్ రాజా.