TV9 Telugu

19 January 2024

రవితేజ సినిమాకు రిలీజ్ కష్టాలు.! ఛాంబర్‏కు లేఖ.

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా ఈగల్. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.

ఇన్నాళ్లు ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్‏గా కార్తీక్ ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

నిజానికి ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది.

కానీ ఈసారి పండక్కి ఎక్కువ మూవీస్ విడుదల కానుండడంతో థియేటర్స్ సరిపోవని..

ఇబ్బందులు రావడం ఖాయమని.. తమ సినిమా రిలీజ్ వాయిదా వేయాలని సూచించారట నిర్మాతలు.

దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ఇప్పుడు ఈగల్ సినిమాకు మళ్లీ పోటీ ఏర్పడింది.

ఫిబ్రవరి 8న యాత్ర 2, ఫిబ్రవరి 9న ఊరు పేరు భైరవకోన, రజినీకాంత్ లాల్ సలామ్ డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. 

దీంతో తమకు సోలో రిలీజ్ డేట్ కావాలంటూ సదరు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ఫిలం ఛాంబర్‏కు లేఖ రాసింది.