రవన్న దావత్ ఇస్తుండు.. 32 ఏళ్ల తర్వాత ఆమెతో రజనీ..
TV9 Telugu
10 April 2024
తాజాగా మంగళవారం ఉగాది పండగ సందర్భంగా తన 75వ సినిమాను ఎనౌన్స్ చేశారు టాలీవుడ్ మాస్ మహరాజ్ హీరో రవితేజ.
భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాలో తెలుగు హీరో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ్ భేరి అని తెలిపారు చిత్రాన్ని ప్రకటించిన మూవీ మేకర్స్.
సినిమాలో రవితేజ క్యారెక్టర్‌ను ఉగాది పంచాగం రూపంలో వివరించారు. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.
32 ఏళ్ల తరువాత సీనియర్ నటి శోభనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.
1988లో రిలీజ్ అయిన దళపతి సినిమాలో సీనియర్ స్టార్ హీరో రజనీకాంత్, సీనియర్ హీరోయిన్ శోభన జంటగా నటించారు.
ఇన్నేళ్ల తరువాత స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఈ కాంబో రిపీట్ కానుంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ టీజర్‌ను షూట్ చేస్తున్నారు దర్శకుడు లోకేష్ కానగరాజ్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి