మరోసారి రవితేజకి జోడిగా ఆ క్యూటీ..

01 నవంబర్ 2023

టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ఎలా ఉంది? ఎంత కలెక్ట్ చేసింది? ఎక్కడెక్కడ ఆడుతోంది... ఈ కైండ్‌ ఆఫ్‌ డిస్కషన్‌కి ఎప్పుడో ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు రవితేజ.

టైగర్‌ నాగేశ్వరరావు ముచ్చట నిన్నటిది. ఇప్పుడు రవితేజ కాన్‌సెన్‌ట్రేషన్‌ మొత్తం గోపీచంద్‌ మలినేని మూవీ మీదే.

మూడు సినిమాలతో హిట్‌ కాంబో అనిపించుకున్నారు రవితేజ అండ్‌ గోపీచంద్‌. మరోసారి ఆడియన్స్ కి మాస్‌గా క్రాక్‌ కా బాప్‌ హిట్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

ఇందులో రవితేజ పక్కన రాశీఖన్నా నటిస్తారనే మాట వైరల్‌ అవుతోంది. ఆల్రెడీ బెంగాల్‌ టైగర్‌లో వీరిద్దరి కాంబో మెప్పించింది.

టచ్‌ చేసి చూడులోనూ రవితేజ - రాశీ కాంబో బాగానే క్లిక్‌ అయింది. ఆ తర్వాత రవితేజ హీరోగా చేసిన రాజా ది గ్రేట్‌లోనూ రాశీఖన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌కి ఆడిపాడారు.

ఆల్రెడీ మూడు సార్లు స్క్రీన్‌ మీద సందడి చేసిన ఈ కాంబో ఇప్పుడు మరోసారి కలిసి కనిపించడానికి రెడీ అవుతున్నారన్నది హాట్‌ న్యూస్‌.

ఇటీవల రాశీఖన్నాకి టాలీవుడ్‌లో చరిష్మా కాస్త తగ్గింది. నార్త్ మీదే ఎక్కువ కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు ఈ బ్యూటీ.

ఇప్పుడు రవితేజ సినిమాతో మరోసారి తానేంటో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రూవ్‌ చేసుకోవాలని అనుకుంటున్నారట ఈ బ్యూటీ.