మిస్టర్ బచ్చన్ క్రేజీ అప్‌డేట్.. భీమా సినిమా షూటింగ్..

TV9 Telugu

12 January 2024

మాస్ మహారాజ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం మిస్టర్ బచ్చన్.

ఈ మధ్యే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో రవితేజకి జోడిగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈమె కూడా సెట్‌లో జాయిన్ అయ్యారు.

ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ మూవీ దర్శక నిర్మాతలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.

గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా భీమా.

ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు గోపీచంద్. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఈయనకు భీమాపై ఆశలు బాగానే ఉన్నాయి.

ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్ కథానాయకిగా నటిస్తుంది. మరో హీరోయిన్ గా మాళవిక శర్మ నటిస్తుంది.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసారు మేకర్స్. కాగా సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది.