హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు మాస్ మాహారాజా రవితేజ.
ఇటీవలే టైగర్ నాగేశ్వర రావు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ.. ఆ తర్వాత ‘ఈగల్’ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు.
ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.
తాజాగా రవితేజ ఈగల్ సినిమా ఓటీటీ రైట్స్‌ను.. ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ విషయాలను తెలియజేస్తూ ఈటీవీ విన్ పోస్టర్ రిలీజ్ చేసింది.
అయితే ఈ సినిమాను తమ ఓటీటీ ప్లాట్ ఫాంలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ చేస్తుందనే డేట్‌లో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఆ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం.
వాస్తవానికి విడుదలైన తేదీ నుంచి కనీసం నాలుగైదు వారాల తర్వాత ఏ మూవీని అయినా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారు. ఆ లెక్కన ప్రకారం మార్చ్ చివరి వారంలో ఓటీటీలోకి రానుంది.