సంక్రాంతికి ఈగల్ రిలీజ్ లోపు మరో సినిమా సెట్స్‌పైకి..
14 December 2023
ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవితో కలిసి నటించిన వాల్తేర్ వీరయ్య చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు రవితేజ.
తర్వాత రవాణాసుర, టైగర్ నాగేశ్వరరావు అనే రెండు చిత్రాలు వచ్చినప్పటికీ... అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ప్రస్తుతం ఈగల్ చిత్రంతో హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయక. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు.
ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న రానుంది. రవితేజ సంక్రాంతి సెంటిమెంట్ తో ఈ చిత్రనికి విజయం తథ్యమని భావిస్తున్నారు.
ఈగల్ సినిమాతో సంక్రాంతికి రాబోతున్న రవితేజ.. ఆ లోపు మరో సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మొదలుపెట్టిన సినిమా అనుకోని కారణాలతో ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది.
అందుకే హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫోటోషూట్ వర్క్ నడుస్తుందని తెలుస్తుంది.
షాక్, మిరపకాయ్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేయబోయే మూడో సినిమా ఇది. వీటిలో మిరపకాయ్ మంచి విజయాన్ని అందుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి