TV9 Telugu
06 January 2024
'మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు' ఈగల్ వార్నింగ్
మాస్ మహరాజ్‌గా టాలీవుడ్లో తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రవితేజ.
తాజాగా ఓ అడుగు వెనక్కి వేశాడు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు.
అందులోనూ ఓ ఊర మాసు అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు రవితేజ.
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఈగల్ జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది.
కానీ పండగ రోజు దాదాపు 5 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడం ఇది పరిశ్రమకు మంచిది కాదంటూ..
టాలీవుడ్ పెద్దలు చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గారు రవితేజ. బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.. అంటూ ఓ నోట్‌ను రిలీజ్ చేశాడు.
మొండోడి మనసు పుట్ట తేనే అని అందుకే పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుంచి ఫిబ్రవరి 9కి మార్చినట్టు ఈ నోట్‌లో కోట్ చేశాడు.
అంతేకాదు మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదంటూ... ఓ పవర్ ఫుల్ మాస్ డైలాగ్‌ను కూడా ఆ నోట్ చివర్లో వదిలాడు ఈ ఈగల్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి