మిస్టర్ బచ్చన్‌ అప్‌డేట్.. ఆషికీ3 హీరోయిన్ ఫిక్స్..

29 December 2023

TV9 Telugu

రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా మిస్టర్‌ బచ్చన్‌. గతంలో వీరిద్దరి కాంబోలో షాక్, మిరపకాయ్ చిత్రాలు వచ్చాయి.

తాజాగా దీని చిత్రీకరణ గురించి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది.

ఈ మూవీలో రవితేజ అమితాబ్‌ బచ్చన్‌ అభిమానిగా కనిపిస్తారని సమాచారం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రముఖ కన్నడ ఫైట్‌ మాస్టర్‌ జాలీ బాస్టియన్‌ కన్నుమూశారు. బెంగుళూరులోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు.

తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 900 సినిమాలకు ఫైట్‌ మాస్టర్‌గా పనిచేశారు జాలీ బాస్టియన్‌.

ఆయన మృతి యాక్షన్‌ రంగానికి తీరని లోటు మిగిలిందని మొత్తం కన్నడ సినిమా ఇండస్ట్రీ సంతాపాన్ని ప్రకటించింది.

కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా ఆషికీ3 తెరకెక్కనుంది. ఇందులో నాయికగా త్రిప్తి దిమ్రిని ఎంపిక చేశారు. అనురాగ్‌ బసు డైరక్ట్ చేయనున్నారు.

2024లో సినిమా షూటింగ్‌ మొదలవుతుంది. యానిమల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు త్రిప్తి దిమ్రి. పూర్తి స్థాయిలో రామ్‌కామ్‌గా తెరకెక్కనుంది ఆషికీ3.