ఘనంగా ఈగల్ ప్రీ రిలీజ్.. అంబాజీపేట కలెక్షన్..

TV9 Telugu

06 February  2024

రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థపర్ జంటగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఈగల్.

ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. తాజాగా ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.

సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు దర్శక నిర్మాతలు. రవితేజ అభిమానులకు నచ్చే అంశాలు సినిమాలో ఉన్నాయని తెలిపారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోగా పేరు పొందిన విజయ్ దేవరకొండ అనుకోని విధంగా మరో అరుదైన ఘనత సంధించారు.

సోషల్ మీడియాలో ఈయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ ఫాలోయర్స్ సంపాదించారు.

కేవలం అల్లు అర్జున్ మాత్రమే విజయ్ కంటే ముందున్నారు. ఆయనకు సోషల్ మీడియాలో 25 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

సుహాస్, శివానీ జంటగా వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రానికి మూడు రోజుల్లోనే 8 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.

ఒకరోజు ముందుగానే వేసిన ప్రీమియర్స్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి ధన్యవాదాలు తెలిపారు దర్శక నిర్మాతలు.