ఈగల్ నుంచి క్రేజీ అప్డేట్.. నితిన్ కొత్త మూవీకి క్రేజీ టైటిల్..
TV9 Telugu
27 January 2024
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ఈగల్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కానుకగా ఈగల్ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేసారు. ఈగల్ ఆన్ ది వే అంటూ పవర్ ఫుల్ లిరిక్స్‌తో ఈ పాట సాగుతుంది.
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. డిజే టిల్లు సినిమాకు సీక్వెల్ ఇది.
ఫిబ్రవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఈగల్ కారణంగా వాయిదా పడింది. మార్చ్ 29న టిల్లు సీక్వెల్ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేసారు మేకర్స్.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో భీష్మ లాంటి హిట్ తర్వాత వస్తున్న సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసారు.
రిపబ్లిక్ డే సందర్భంగా టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి రాబిన్ హుడ్ అనే టైటిల్ ఖరారు చేసారు.
భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు అంటూ నితిన్ టీజర్‌లో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. టీజర్ కూడా చాలా స్టైలిష్‌గా కట్ చేసారు.