TV9 Telugu
ఈగల్ మాస్ సంబరాలు.. ఊరి పేరు భైరవకోన ప్రెస్ మీట్..
13 Febraury 2024
మాస్ మహరాజ్ రవితేజ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఈగిల్. ఇటీవల శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో ఆకట్టుకుంది. కావ్య థాపర్ రవితేజకి జోడిగా ఈ మూవీలో నటించింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్.
రోజురోజుకీ ఈగిల్ సినిమాకు జనాల్లో వస్తున్న ఆదరణ చూస్తుంటే, ఆనందంగా ఉందని అన్నారు మాస్ మహారాజ్ రవితేజ.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన తెలుగు అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా ఊరి పేరు భైరవకోన.
ఈ సినిమా ఫిబ్రవరి 16 (శుక్రవారం)న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ద్వారా సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల సమయం దగ్గరపడుతున్నా సందర్భంగా తాజాగా విలేకరులతో ముచ్చటించింది ఊరి పేరు భైరవకోన మూవీ యూనిట్.
ఎంతో కష్టపడి ఈ సినిమాను చేశామని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని అన్నారు ఈ సినిమా హీరో సందీప్ కిషన్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి