TV9 Telugu
ఈగల్ వసూళ్లు.. ఆ సినిమా తర్వాత బాలయ్య అఖండ 2..
21 Febraury 2024
రవితేజ, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఈగల్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటించారు.
ఈ నెల 9న విడుదలైన ఈ సినిమాకు 50 కోట్లు గ్రాస్ వసూలు చేసిందంటూ పోస్టర్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. స్టైలిష్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా వచ్చిన ఈగల్ సినిమా.
మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడు ఎవరైనా బాగా అలసిపోవాలి అని అంటున్నారు నటి శ్రుతిహాసన్. ప్రతిరోజూ మానసికంగానూ, శారీరకంగానూ అలసిపోవాలి.
అలాంటప్పుడే మనం పనికి పూర్తి న్యాయం చేసిన వాళ్లం అవుతామని అంటున్నారు ఈ బ్యూటీ. అలా అలసిపోని రోజు తన దృష్టిలో చెత్తలా ఉంటుందని అన్నారు శ్రుతి.
బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ డ్రామా చిత్రం అఖండ. వీరి కాంబోలో మూడో చిత్రమిది.
ఈ సినిమా సీక్వెల్ వస్తుందని చాలా రోజుల కిందే చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
బోయపాటి ఇప్పటికే కథ సిద్ధం చేయగా.. ఎం రత్నం డైలాగ్ వర్షన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. బాబీ సినిమా తర్వాత అఖండ 2 ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి