బీటౌన్‌లో మాస్ రాజా సందడి.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనూ తలపడ్డ చిత్రాలు..

TV9 Telugu

08 January 2024

బాలీవుడ్ స్టార్ అజయ్‌ దేవగన్‌ హీరోగా రాజ్ కుమార్ గుప్తా దర్శత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ పీరియాడిక్‌ మూవీ రైడ్‌.

ఇప్పుడు తాజాగా ఈ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు మూవీ మేకర్స్‌.

తాజాగా శనివారం ముంబైలో ఘనంగా జరిగిన రైడ్ 2 సినిమా ప్రారంభోత్సవంలో మిస్టర్ బచ్చన్ మూవీ టీమ్‌ పాల్గొంది.

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజతో పాటు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్‌ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఏడాది సంక్రాంతి పండగ బరిలో పోటి పడుతున్న టాలీవుడ్ సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విషయంలోనూ తలపడ్డాయి.

నిన్న (ఆదివారం) రోజున సంక్రాంతి పండక్కి విడుదల కానున్న రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ ఘనంగా జరిగాయి.

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఆదివారం వైజాగ్‌లో జరిగింది.

అలాగే హైదరాబాద్‌లో జరిగిన తేజ సజ్జ హనుమాన్ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.