ఒకే రూట్ లో బాలయ్య, రవితేజ..

28 October 2023

బాలయ్య, రవితేజ వాళ్ళ సినిమాల్లో ఎవరున్నా ఓకే అంటుంటారు. ముఖ్యంగా డేట్స్ డిస్టర్బ్ కాకుండా ఉంటే చాలనుకుంటారు ఈ మాస్ హీరోలిద్దరూ.

బాలయ్య సింపుల్‌గా చిన్న హీరోయిన్లతోనే వెళ్తుంటారు. గత కొన్నేళ్లుగా రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్, ప్రగ్యా జైస్వాల్, హనీ రోజ్ లాంటి హీరోయిన్లతో జోడీ కట్టారు.

మాస్ రాజా రవితేజ కూడా డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి, నుపుర్ సనన్ అంటూ కొత్త వాళ్లకే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు.

ఇది చాలా మంది ముద్దుగుమ్మలకు వర్కవుట్ అయింది కూడా. అప్పట్లో కిక్ 2లో రవితేజతో నటించాకే రకుల్‌ దశ మారింది.

స్టార్ హీరోయిన్లతో తాను నటించడం కాదు.. తనతో నటించిన తర్వాత హీరోయిన్లకు స్టార్ ఇమేజ్ రావాలనేది రవితేజ కాన్సెప్ట్.

రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్ లాంటి వాళ్లతో ఆఫర్స్ అందుకున్నారు. ఇప్పుడు ఖిలాడీ తర్వాతే మీనాక్షి చౌదరి జాతకం మారిపోయింది.

తాజాగా గోపీచంద్ మలినేని సినిమా మొదలు పెట్టారు మాస్ రాజా. అందులో హీరోయిన్ కోసం వేట మొదలైంది. బలుపు, క్రాక్‌లో శృతి హాసన్‌తోనే జోడీ కట్టారు రవితేజ.

ఈ సారి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. కృతి శెట్టితో పాటు ఒకట్రెండు ఆప్షన్స్ ఉన్నా ఎవరూ ఫైనల్ అవ్వలేదు.

మరోసారి అప్‌కమింగ్ బ్యూటీ వైపు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి హీరోయిన్స్ విషయంలో రవితేజ రూటే సపరేట్.