TV9 Telugu

నటీమణులు కూడా ‘హీరో’గా మారగలరు: రవీనా టాండన్..

28 Febraury 2024

టీవీ9 న్యూస్ నెట్‌వర్క్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్ టుడే’ కార్యక్రమంలో నటి రవీనా టాండన్ పాల్గొన్నారు.

సినీ పరిశ్రమలో ఆమె సాధించిన విజయాలు, సేవలకు గుర్తింపుగా రవీనా టాండన్‌కు ‘నక్షత్ర అవార్డు’ లభించింది.

అవార్డు అందుకున్న తర్వాత ఆమె ‘వాట్ ఇండియా థింక్ టుడే’ చర్చలో పాల్గొని చిత్ర పరిశ్రమ గురించి తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో నటి రవీనా మాట్లాడుతూ.. తాను నటించడం ప్రారంభించినప్పుడు సినీ పరిశ్రమలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిపారు.

సినిమా రంగంలో మహిళల పరిస్థితి గురించి, సినిమాల విషయంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు ఎలా ఉన్నాయో వివరించారు.

రవీనా టాండన్ తన పెంపకంతో పాటు కుటుంబ నేపథ్యం గురించి కూడా మాట్లాడారు. తన తండ్రి తనను కొడుకులా పెంచాడని గర్వంగా చెప్పుకున్నారు.

సినీ పరిశ్రమలో అందరు నటీమణులు ఒకే తరహా సినిమాలు చేస్తున్నప్పుడు తాను విభిన్నమైన పంథాలో పయనించానని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత OTT, ఇంటర్నెట్ యుగం ప్రభావంతో చిత్ర పరిశ్రమ మారిన తీరు గురించి మాట్లాడుతూ, నటీమణులు కూడా ఈ రోజు చిత్రానికి ‘హీరో’గా మారగలరని అన్నారు.