రత్నం క్రేజీ అప్డేట్.. 

TV9 Telugu

17 April 2024

కోలీవుడ్ స్టార్ విశాల్‌ హీరోగా ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ హరి తెరకేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రత్నం.

విశాల్‌ సరసన ప్రియా భవాని శంకర్ ఈ సినిమాలో కథానాయకిగా నటిస్తుంది. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.

సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, కోలీవుడ్ స్టార్ యోగిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

‘భరణి’, ‘పూజ’ లాంటి హిట్స్ తర్వాత విశాల్-హరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు.

విడుదల దగ్గర పడటంతో ప్రోమయోషన్స్ లో బిజీ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసింది మూవీ టీమ్‌.

ఓ రాజకీయ నాయకుడి దగ్గర పనిచేసే వ్యక్తిగా కనిపిస్తారు విశాల్‌. ట్రైలర్ సినీ ప్రేమికులు ఆకట్టుకొనేలా ఉంది.