రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లు అడుగుపెట్టి తన అందాలతో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .
బిగ్ బాస్ తెలుగు 7 లో తన టాస్క్‌లతో పాటు అంద చందాలతో అదరగొట్టింది అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈమె బిగ్‌బాస్ హౌస్‌లోకి 10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. నాల్గో వారంలో రతిక ఎలిమినేట్ అయ్యి.. మళ్లీ వైల్డ్ కార్డ్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇక రతిక రోజ్ పర్సనల్ విషయానికి వస్తే.. మే 12న జన్మించింది. ఈ ముద్దుగుమ్మ పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే..
ఇక 2016లో ప్రారంభమైన పటాస్ షోతో ఈమె కెరీర్ ప్రారంభించింది. ఆ షో ఈమెకు పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి.
ఆ తర్వాత నెమ్మదిగా కొన్ని సినిమాలు ఆ తర్వాత సీరియల్స్‌లో తన లక్ పరీక్షించుకుంది. స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వక ముందు ఈమె ఓ మోడల్‌గా రాణించింది.
ఇక మరోవైపు రతిక కొన్నేళ్ల క్రితం బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె ప్రేమాయణం నడిపించింది. ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో వాళ్ల బంధానికి బ్రేకప్ పడింది
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దగుమ్మ సోషల్ మీడియా లో షేర్ ఫోటోస్ క్రేజీ కామెంట్స్ తో వైరల్ అవుతున్నాయి.