క్యూట్ అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న రతికా రోజ్

TV9 Telugu

05 JULY 2024

రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లు అడుగుపెట్టి తన అందాలతో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

బిగ్ బాస్‌ తెలుగు 7 లో తన టాస్క్‌లతో పాటు అంద చందాలతో అదరగొట్టింది అందరిని ఆకట్టుకుంది ఈ  ముద్దుగుమ్మ.

ఈమె బిగ్‌బాస్ హౌస్‌లోకి 10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. నాల్గో వారంలో రతిక ఎలిమినేట్ అయ్యి.. మళ్లీ వైల్డ్ కార్డ్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇక మరోవైపు రతిక కొన్నేళ్ల క్రితం బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె ప్రేమాయణం నడిపించింది. ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో వాళ్ల బంధానికి బ్రేకప్ పడింది.

తమిళంలో సూపర్ హిట్టయిన 'పిజ్జా' ఫ్రాంచైజీలో ఇప్పటి వరకూ మూడు సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'పిజ్జా 4: హోమ్ అలోన్' పేరుతో నాలుగో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో సీనియర్ నటుడు నాజర్ తనయుడు అభి హాసన్ హీరోగా నటిస్తుండగా.. హీరోయిన్ గా తెలుగు బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్ ను ఎంపిక చేశారు.

హారర్ థ్రిల్లర్ 'పిజ్జా 4: హోమ్ అలోన్' సినిమాని ప్రారంభించినట్లు నటి రతిక రోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.