తన సొగసుతో ఆ చీరని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రతిక.. 

24 September 2024

Battula Prudvi 

12 అక్టోబర్ 1995న తెలంగాణలోని హైదరాబాద్‎కి దగ్గరలో ఉన్న వికారాబాద్‎లో జన్మించింది వయ్యారి భామ రతిక రోజ్.

హైదరాబాద్‎లోని మల్లా రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి బిటెక్‎లో డిగ్రీ పట్టా పొందింది.

బిగ్‎బాస్‎‎లో తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఆటతోనే కాదు అందాలతో అందరిని ఉక్కిరి బిక్కిరి చేసింది.

రతిక్ రోజ్ బిగ్‏బాస్ షోలోకి అడుగు పెట్టి పల్లవి ప్రశాంత్, యావర్‎లతో లవ్ ట్రాక్ నడపటంతో మరింత ఫేమస్ అయింది.

బిగ్ బాస్ సీజన్ 7 పక్కా గేమ్ ప్లే తో హౌస్‎లోకి అడుగుపెట్టి మొదటి రోజు నుండే కంటెంట్ ఇవ్వడం మొదలెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయినప్పటికీ  ఉల్టా ఫల్టా నిర్ణయంతో రతిక రీఎంట్రీ ఇచ్చి 11వ వారం ఎలిమినేట్ అయ్యింది.

మొత్తంగా 9 వారాలు హౌస్లో ఉన్న రతిక రూ. 18 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారని సమాచారం. బిగ్ బాస్ ఫేమ్‎తో ఆమెకు ఆఫర్స్ పెరుగుతున్నాయి.

బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో తొలిసారి నటించింది. తర్వాత నారప్ప, అశోక వనంలో అర్జున కల్యాణం, నేనూ స్టూడెంట్ సర్ చిత్రాల్లో నటించింది.