అలాంటి పాత్రలు చేసి చేసి అలసిపోయా - 'మిర్జాపూ
ర్' బీనా ఆంటీ
Phani CH
28 AUG 2024
బీనా ఆంటీ.. ఈ పేరు చెప్తే గుర్తుపట్టని వారంటూ ఉండరు. ‘మిర్జాపూర్’ లో ఈమె చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి.
‘మిర్జాపూర్’… హిందీ వెబ్ సిరీస్ అయినప్పటికీ సౌత్ లాంగ్వేజెస్ లోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. దానికి కారణం డబ్బింగ్ అనే చెప్పాలి.
అయితే బీనా ఆంటీ అసలు పేరు రసిక్ దుగల్.. కానీ మిర్జాపూర్ సిరీస్ వల్ల బీనా ఆంటీగానే ఎక్కువగా ఫేమస్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి స్పందిస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
రసిక దుగల్ మాట్లాడుతూ.. “నాకు ఎక్కువగా ఏడ్చే సీన్లే ఇస్తుండేవారు. ఇక ఏడవడం అనేది నా వల్ల కాదు.అలాంటి సీన్లు చేసి చేసి అలిసిపోయాను.
నన్ను ఏ ప్రాజెక్టులో తీసుకున్నా సరే చివర్లో ఏడుపు సీన్లు ఇస్తుండేవాళ్లు. అవి నాకు బాగా బోర్ కొట్టేశాయి అని తెలిపింది.
ఇప్పుడు డైరెక్టర్లు నన్ను దృష్టిలో పెట్టుకుని డిఫరెంట్ రోల్స్ డిజైన్ చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పింది.
ఇక్కడ క్లిక్ చేయండి