విజయ్ దేవరకొండతో మళ్లీ సినిమా ?.. రష్మిక ఆన్సర్ ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
పుష్ప సినిమా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకున్న నేషనల్ క్రష్.. ఇటీవలే యానిమల్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు పుష్ప 2లో నటిస్తుంది.
కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. తాజాగా రష్మిక టోక్యోలో జరుగుతున్న క్రంచైరోల్ అనిమే అవార్డ్స్ వేడుకలలో పాల్గొంది.
ఈ అవార్డ్స్ ఈవెంట్లో పాల్గొన్న మొదటి భారతీయ సినీనటి రష్మిక కావడం విశేషం. ఈ సందర్భంగా పింక్ విల్లాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
పుష్ప 2 సినిమాలో పుష్పరాజ్ భార్యగా తన బాధ్యతలు మరింత పెరిగాయని.. ప్రేక్షకులకు అంచనాలను అందుకునే స్థాయిలోనే.. ఇందులో ఎక్కువగా మాస్ కంటెంట్ ఉంటుందని తెలిపింది.
అలాగే మళ్లీ విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేస్తారా ? అనే ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ.. మంచి స్క్రిప్ట్ వస్తే మళ్లీ ఇద్దరం కలిసి నటించేందుకు రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చింది రష్మిక.
విజయ్‌తో కలిసి ఒక సినిమా చేసి చాలా కాలం అయ్యింది.. అభిమానులు మా ఇద్దరిని కలిసి మళ్లీ వెండితెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది.
విజయ్, రష్మిక కలిసి నటించిన గీతా గోవిందం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీ మంచి విజయం అందుకోవడంతో హిట్ పెయిర్‌గా నిలిచారు.
అంతేకాకుండా వీరిద్దరు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. ఇటీవల తన భర్త VDలా ఉండాలంటూ రష్మిక చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.